అమరావతి : ఏపీలో సముద్ర తీర ప్రాంతంలో చేపల వేటను నిషేధిస్తూ … కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మత్స్య వనరుల పరిరక్షణలో భాగంగా …. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు మొత్తం 61 రోజులపాటు సముద్ర తీరంలో చేపల వేటపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సాంప్రదాయ నాటు పడవలు మినహా మెకనైజ్డ్, మోటరైజ్డ్ పడవలు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని పేర్కొంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
