ప్రజాశక్తి – కడప అర్బన్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారానని కోపంతో అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, జగన ్‌మోహన్‌రెడ్డి, భారతిరెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డి తనను టార్గెట్ చేసి ఐదేళ్లు చలా ఇబ్బంది పెట్టారని అప్రూవర్ దస్తగిరి రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప సెంట్రల్ జైల్లో 2023, నవంబర్ 28న తాను జైల్లో ఉన్న సమయంలో దేవి రెడ్డి చైతన్య రెడ్డి నన్ను బెదిరించిన సిసి ఫుటేజీ ఏమైందని ప్రశ్నించారు. తన తోటి ఖైదీలను కూడా విచారించవచ్చని పేర్కొన్నారు. పులి వెందుల నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బిటెక్ రవి ఆరోజు జైల్లోనే ఉన్నారని తెలిపారు. ఆయన్ను సాక్షి కింద వేసుకుని విచారించాలని కోరారు. వీటన్నిటిపై కోర్టుకు వెళతానని పేర్కొన్నారు. ఎస్‌పి దష్టికి కూడా తీసుకు వెళతానని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి వైఎస్ వివేకానంద కేసు చాలెంజ్‌గా తీసుకుందని తాను భావిస్తున్నానని తెలిపారు. ఈ విషయాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రస్తావించారని గుర్తు చేశారు. వివేక హత్య కేసులో తాను కూడా తప్పు చేశానని పేర్కొన్నారు. తన పైనా చర్యలు తీసుకోవచ్చు అన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సిబిఐని ఎందుకు అడ్డుకున్నారు, బెదిరి ంచారని ప్రశ్నించారు. జైల్లో తనను బెది రించిన వారిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చా నని చెప్పారు. కొత్త ఎస్‌పి దష్టికి తన బాధను తెలియజేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నింది తులకు శిక్ష పడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి లోకేష్‌ను కలుస్తానని చెప్పారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలన్నారు.
