ఐదేళ్లలో వైసిపి ఆరాచక పాలన

Apr 12,2024 21:22

  ప్రజాశక్తి – జామి  :  ఐదేళ్లలో వైసిపి అరాచక పాలన సాగించిందని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని అట్టాడ, కుమరాం, బాలరాంపురం గ్రామాల్లో శ్రీనివాస్‌ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా టిడిపి సూపర్‌ సిక్స్‌ హామీలను ప్రజలకు వివరించారు. ప్రస్తుత అసమర్థ వైసిపి ప్రభుత్వం సంపద సృష్టించలేకపోయిందని, ఈ ఐదేళ్లు అరాచకం, విధ్వంసం చేయడం పాలనగా సాగించిందని చెప్పారు. సంపద సృష్టిస్తేనే అభివృద్ధి, సంక్షేమం రెండు సమానంగా ముందుకు తీసుకువెళ్లగలమని, గతంలో చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని రుజువు చేశారని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు స్వామినాయుడు, పార్లమెంట్‌ అధ్యక్షులు సూర్యారావు, జనార్దన్‌ మాస్టారు, సీనియర్‌ నాయుకులు అప్పలరాజు, కొయ్యన శ్రీను, నర్సింహా నాయుడు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి సత్యనారాయణ, జనసేన మండల అధ్యక్షులు రాంబాబు, బిజెపి మహిళా అధ్యక్షులు లక్ష్మి పాల్గొన్నారు.

➡️