ప్రజాశక్తి-నాయుడుపేట (తిరుపతి) : మాజీ ముఖ్యమంత్రి,వైసీపీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి,సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆదేశాల మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం నాయుడుపేట పట్టణంలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వైసిపి రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి.సత్యనారాయణరెడ్డి,వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు తంబిరెడ్డి.సుబ్రహ్మణ్యం రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు కామిరెడ్డి.రాజారెడ్డి, వైసీపీ పట్టణ అధ్యక్షులు కలికి.మాధవరెడ్డి,వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు ఒట్టూరు.కిషోర్ యాదవ్,రాష్ట్ర మహిళా కార్యదర్శి కురగుండ్ల.ధనలక్ష్మి మరి కొంతమంది వైసీపీ నాయకులతో కలసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయిందని విమర్శించారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు.కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టడం తప్ప,రాష్ట్ర అభివఅద్ధికి అడుగులు వేయలేకపోతుందని ఆరోపించారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను పెంచేందుకు,పార్టీని బలోపేతం చేసేందుకు సమిష్టిగా కఅషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.
