తాగునీటిపై దృష్టిసారించండి

Apr 16,2025 21:27

ప్రజాశక్తి-సీతంపేట :  తాగునీటి సమస్యపై దృష్టి సారించాలని జిల్లా గ్రామీణ పంచాయతీ అధికారి టి.కొండలరావు.. కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం మండలంలోని పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పిఆర్‌ వన్‌ యాప్‌, తాగునీరు, పారిశుధ్యం, ఇంటి పన్నుల వసూలుపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణ విషయంలో తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం సీతంపేట చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించారు. వర్మీ కంపోస్ట్‌ తయారు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్‌పిఒ కె.రాంప్రసాద్‌, డిపిఆర్‌సి సిబ్బంది, డిప్యూటీ ఎంపిడిఒ కె.సత్యం, పంచాయతీ కార్యదర్శులు రామకృష్ణ, పాపారావు, వినోద్‌, శ్యామ్‌, అప్పలసూరి, రాజశేఖర్‌, రాజారావు, తదితరులు పాల్గొన్నారు. సంపద కేంద్రాన్ని సందర్శించిన డిజిపిఒవీరఘట్టం : మండల కేంద్రంలోని చెత్త సంపద కేంద్రాన్ని డిజిపిఒ టి.కొండలరావు సందర్శించారు. తడి, పొడి చెత్తలు సేకరించి, వాటి ద్వారా సంపద సృష్టించేందుకు బాధ్యత వహించాలని మేజర్‌ పంచాయతీ ఇఒ కోటేశ్వరరావును ఆదేశించారు. సంపద ద్వారా వచ్చే ఆదాయం పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ బి.వెంకటరమణ, ఇఒపిఆర్‌డి టి.వెంకట రమణ మూర్తి నాయుడు, మేజర్‌ పంచాయతీ సిబ్బంది ఉన్నారు.

➡️