సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలి

Nov 5,2024 21:53
ఫొటో : మాట్లాడుతున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలి

ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : టిడిపి సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే ఆత్మకూరు నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదుపై మండల కన్వీనర్లు, నాయకులు, బూత్‌ ఏజెంట్లకు దిశానిర్థేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ టిడిపి సభ్యత్వం నమోదుపై పార్టీ నేతలు కార్యకర్తలందరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. సభ్యత్వ నమోదుకు సంబంధించి రాష్ట్రంలో పది నియోజకవర్గాలను మోడల్‌ నియోజకవర్గాలుగా పార్టీ ఎంపిక చేయగా ఇప్పటివరకు కళ్యాణదుర్గం మొదటి స్థానం ఆత్మకూరు రెండో స్థానంలో నిలిచిందన్నారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఆత్మకూరు ప్రధాన ప్రథమ స్థానంలో ఉందని, ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో ఆత్మకూరులో మొదట స్థానానికి చేరుకునేలా పార్టీ కేడర్‌ అంతా సభ్యత్వం నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. నియోజకవర్గంలో 1.20లక్షల మందిని సభ్యులుగా చేర్చుకునేందుకు లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. ప్రతి బూత్‌లో కూడా 70శాతం ఓటర్లను పార్టీ సభ్యులుగా నమోదు చేసి లక్ష్యాన్ని అధిగమించేందుకు అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందని, రూ.5లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తూ వారి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, కో-ఆపరేటివ్‌ సొసైటీలకు నామినేటెడ్‌ పదవులు పదవులను భర్తీ చేస్తామన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి భవిష్యత్తులో అన్ని పదవుల్లోనూ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ప్రతి పంచాయతీలో కూడా రూ.10 కోట్లతో సిమెంట్‌ రోడ్లు మంజూరు చేస్తామని, ఆలయ మరమ్మతులకు రూ.5 లక్షలు మంజూరు చేస్తామని, మండలానికి 50 గోకులాలను మంజూరు చేస్తామని, రోడ్డు మరమ్మతులు పనులు మొదలుపెట్టామన్నారు. ప్రతినెలా 1వ తేదీన క్రమం తప్పకుండా సామాజిక పింఛన్లు, ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేకున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జాప్యం లేకుండా పరుగులు తీస్తున్నామని పార్టీ కేడర్‌ అంతా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూనే పార్టీ బలోపేతం కోసం సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో కిమ్స్‌ ఇడి టిడిపి నాయకులు తాళ్లూరి గిరినాయుడు, పార్టీ పరిశీలకులు బుల్లెట్‌ రమణ, ఆత్మకూరు ఎంపిపి కేత వేణుగోపాల్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గోపారం వెంకటరమణమ్మ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️