రహదారి నిబంధనలు పాటించాలి

ప్రజాశక్తి-బాపట్ల : వాహన చోదకులు రహదారి నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని బాపట్ల మోటారు వాహన తనిఖీ అధికారి డివి. రంగారావు తెలిపారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సంద ర్భంగా రంగారావు మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి ఫిబ్రవరి 15 వరకూ నెల రోజులపాటు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణకు వాహన చోదకులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలన్నారు. వాహనాలు అతివేగంతో నడిపి ప్రమాదాల బారిన పడకుండా క్షణం క్షణం అనుక్షణం రహదారిపై జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమారి, కిషోర్‌ బాబు, అంకమ్మరావు, సిబ్బంది, వాహన చోదకులు పాల్గొన్నారు.

➡️