వైద్యశాలలో అన్నదానం

ప్రజాశక్తి-గిద్దలూరు రూరల్‌: గిద్దలూరు ప్రాంతీయ వైద్యశాలలో బుధవారం గాంధీ జయంతి సందర్భంగా పూసల బజార్‌కు చెందిన కీర్తిశేషులు తోట లక్ష్మీదేవి జ్ఞాపకార్థం వారి కుమారులు జర్నలిస్ట్‌ తోట శ్రీనివాసులు 400 మందికి అన్నదానం చేశారు. టిడిపి నాయకుడు కష్ణ కిషోర్‌ రెడ్డి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జీవన జ్యోతి జూనియర్‌ కళాశాల ఎన్‌సిసి విద్యార్థులు వైద్యశాల ఆవరణలో చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సూరిబాబు మాట్లాడుతూ అన్నదానం చేసిన జర్నలిస్టు తోట శ్రీను కుటుంబ సభ్యులకు, ముత్తుముల కష్ణ కిషోర్‌ రెడ్డికి, శ్రమదానం చేసిన జీవనజ్యోతి కళాశాల ఎన్‌సిసి విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

➡️