క్వార్టర్‌ ఫైనల్‌ దశకు ఫుట్‌బాల్‌ పోటీలు

Sep 30,2024 00:41

ప్రజాశక్తి – వినుకొండ : స్థానిక లయోల హైస్కూల్‌లో స్కూల్‌ గేమ్స్‌ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలు రెండోరోజైన ఆదివారం కొనసాగాయి. అండర్‌-17 విభాగంలో బాలబాలికల జట్లు రసవత్తరంగా తలపడుతున్నాయి. బాలుర విభాగంలో గుంటూరు, ప్రకాశం, కడప, తూర్పుగోదావరి, అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం బాలికల విభాగంలో కర్నూలు, చిత్తూరు, విశాఖపట్నం, గుంటూరు, అనంతపురం, కడప జట్లు క్వార్టర్‌ ఫైనల్స్‌ వచ్చాయని పల్నాడు జిల్లా స్కూల్‌ గేమ్స్‌ సెక్రెటరీ ఎన్‌.సురేష్‌ కుమార్‌ తెలిపారు. పోటీలను పిఇటిలు టి.ఎలమంద, ఆర్‌.రాధాకృష్ణమూర్తి, వైవి చిరంజీవిరావు, బి.కొండలు, కె.రాజేష్‌, పర్యవేక్షిస్తున్నారు. పోటీల పరిశీలకులుగా డాక్టర్‌ ప్రభాకర్‌ వ్యవహరిస్తున్నారు.

ప్రజాశక్తి- మాచర్ల రూరల ్‌ : జిల్లా స్థాయి చెస్‌, బ్యాట్మెంటెన్‌ పోటీలకు మాచర్ల పట్టణానికి చెందిన కిడ్స్‌ పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. స్థానిక జిల్లా పరిషత్‌ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఎస్‌జిఎఫ్‌ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆదివారం మాచర్ల నియోజకవర్గ స్థాయిలో క్రీడలు నిర్వహించారు. కిడ్స్‌ పాఠశాలకు చెందిన విద్యార్థులు చంద్ర మహేష్‌, వేముల ఆనంద్‌, భార్గవ శ్రీనివాస్‌ నాయక్‌, జూనియర్‌ విభాగంలో తులసీరామ్‌, పవన్‌సాయిరెడ్డి, హారిక, ఈశ్వర్‌ రేవంత్‌ చెస్‌ విభాగంలో జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బ్యాడ్మింటెన్‌లో షణ్ముక సాయి, జూనియర్‌ విభాగంలో చల్లా విజరు చక్రవర్తి, యశ్వంత్‌ కుమార్‌ ఎంపికయ్యారు. వీరు త్వరలో గుంటూరులో జరిగే జిల్లా పోటీల్లో పాల్గొంటారు. ఎంపికైన వారితోపాటు పిఇటిలు రామారావు, ఆనంద్‌ను కిడ్స్‌ పాఠశాల హెచ్‌ఎం జొన్నలగడ్డ రామకృష్ణ శాస్త్రి, శివ ప్రసాద్‌, పవన్‌ అభినందించారు.

ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : సత్తెనపల్లి నియోజకవర్గ స్థాయిలో జరిగిన అథ్లెటిక్స్‌ పోటీల్లో సత్తెనపల్లి జెడ్‌పి బాలికల పాఠశాల విద్యార్థినులు విజయకేతనం ఎగురవేశారు. సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన పోటీల్లో బాలికల పతకాలు సాధించారు. సీనియర్‌ విభాగంలో డిస్క్‌ త్రో, షాట్‌ పుట్‌లో ఎం.దీపిక ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, 800 మీటర్ల పురుగు పందెంలో టి.మహాలక్ష్మీ మొదటి స్థానాన్ని, 4×100 మీటర్ల రిలేలో వై.అక్షయ, వై.హనీశ్రీ, కె.కల్పన, వి.మల్లిక,4×400 మీటర్ల రిలేలో ఎం.రాధ, టి.మహాలక్ష్మి, ఎం.దీపిక, పి.షారోన్‌ పుష్ప విజయం సాధించారు. జూనియర్‌ విభాగంలో 600, 400 మీటర్ల పురుగులో ఐ.వైష్ణవి,100 మీటర్లలో టి.హేమలత మొదటి స్థానం సాధించారు. 400×100 మీటర్ల రిలేలో ఎం.వైష్ణవి, టి.మాదవి, టి.హేమలత విజయం సాధించారు. వీరిని హెచ్‌ఎం టి.మాదవీలత, పిఇటిలు కె.సునీత, సిహెచ్‌.శివగోవర్దన. పి.శాస్త్రీ, ఉపాధ్యాయులు అభినందించారు.

➡️