కాంట్రాక్ట్‌ కార్మికులకు అండ

కాంట్రాక్ట్‌ కార్మికులకు అండ

ప్రజాశక్తి – ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు అన్నారు. సోమవారం స్టీల్‌ప్లాంట్‌ బిసి గేటు వద్ద కాంట్రాక్ట్‌ కార్మికులతో కలిసి నిరసన చేపట్టారు. కార్మిక సంఘం నేతలు మాట్లాడుతూ స్టీల్‌ప్లాట్‌ను సెయిల్‌లో విలీనం చేస్తానని ఒకవైపు చెబుతూనే మరోవైపు పాస్‌ల రంగులను మారుస్తూ కాంట్రాక్ట్‌ కార్మికులపై ఉక్కుపాదం మోపే యోచనలో ఉక్కు యాజమాన్యం ఉందన్నారు.నాలుగు వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులను తొలగించడానికి ఉక్కు యాజమాన్యం రంగం సిద్ధం చేసిందని, దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని కార్మిక సంఘ నేతలు హెచ్చరించారు. కార్యక్రమంలో స్టీల్‌ప్లాంట్‌ ఎంపాయిస్‌ యూనియన్‌, సిఐటియు గౌరవాధ్యక్షుడు జె.అయోధ్యరాం, ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి ఐఎన్‌టియుసి జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్‌, స్టీల్‌ అధ్యక్షుడు నీరుకొండ రామచంద్రరావు టిఎన్‌టియుసి నాయకులు బొడ్డు పైడిరాజు, రాజేష్‌, వంశీ, పులి రమణారెడ్డి పాల్గొన్నారు.

ప్లకార్డులు పట్టుకుని నిరసనలో పాల్గొన్న అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు

➡️