ప్రకాశం : 11 నెలల క్రితం పొదిలిలో ఇతర కులాలతో వేధించబడి మాగులూరి రవి అనే మాదిగ యువకుని బలవన్మరణం కేసును దళిత నేత నీలం నాగేంద్రం కృషి తో ఎట్టకేలకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ గా మార్చారు. సోమవారం ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పొదిలి ఎస్‌ఐ వి.వేమన బలవన్మరణ కేస్ ను ఎస్సీ ఎస్టీగా మార్చి దళిత నేత నీళ్ళం సమక్షంలో హతుని భార్య సలోముకి ఎఫ్‌ఐఆర్ కాపీని అందయజేశారు. గత సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన పొదిలి టైలర్స్ కాలనీ లో మాగులూరు రవి అనే మాదిగ యువకుడు బి.సి కులానికి చెందిన ఒక మహిళతో అక్రమ సంబంధ నేపథ్యంలో వేధింపులకు గురై మాధవి అనే మహిళ ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణం చెందాడన్నారు. ఈ ఘటన ప్రిబ్రవరి 7 వ తేదీన జరుగగా పొదిలి పోలీసు వారు క్రైమ్ నెం 35/2024 అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారన్నారు. ఈ కేసు పై దళిత నాయకులు నీలం నాగేంద్ర చొరవతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనికి విచార అధికారిగా దర్శి డిఎస్పిని నియమించారు.
