తిరుపతి : తిరుమల విషయంలో గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కూటమి ప్రభుత్వం … అధికారంలోకి వచ్చి టిటిడికి అండగా ఉండగా జరుగుతున్నది ఏంటి ? అని టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. శనివారం కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ … తిరుమలలో విజిలెన్స్ నిఘా పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. చంద్రబాబు పాలనలో మద్యం, మాంసం తిరుమలలో పట్టుబడుతున్నాయని ఆరోపించారు. శ్రీవారి ఆలయానికి సమీపంలో గుడ్డు బిర్యాని పట్టుబడింది అంటే టిటిడి వైఫల్యం మరోసారి బుట్టదాఖలైందని ధ్వజమెత్తారు. మారణాయుధాలతో వచ్చిన పట్టించుకోలేని పరిస్థితికి తీసుకువచ్చారని అన్నారు. ఎల్లో మీడియా ద్వారా అబద్ధపు ప్రచారాలు చేశారని ఆరోపించారు. టిడిపి నాయకుల సేవలో టిటిడి చైర్మన్ పనిచేస్తున్నారనీ, భక్తులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తిరుమల కొండపై ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ 4 సార్లు పట్టుబడ్డారని అన్నారు. 40 సార్లు పట్టుబడకుండా తప్పించుకు తిరిగి ఉంటారు అని చెప్పారు. లడ్డు ప్రసాదం విషయం లో తమపై నింద మోపారనీ, తమపై నేరారోపణలు చేశారని ధ్వజమెత్తారు. వీటన్నిటిపై పవన్ కళ్యాణ్ , చంద్రబాబు ను ప్రశ్నించాలని కరుణాకర రెడ్డి కోరారు.
కూటమి పాలనలో టిటిడిలో జరుగుతున్నదేంటి ? : టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి
