ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు

మైలవరం (ఎన్టీఆర్‌ జిల్లా) : మైలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు లంకా లితీష్‌ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని శనివారం మైలవరం పట్టణంలో శనివారం విస్తఅతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. లంకా లితీష్‌ ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన యూనియన్‌ హాస్పిటల్స్‌ నేతఅత్వంలో మైలవరం పట్టణంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో రోగులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గన్నారు. ఈ శిబిరంలో స్థానికులు, మైలవరం పట్టణ ప్రజలు హాజరై వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ శిబిరానికి హాజరైన రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులను అందజేశారు. విజయవాడకు చెందిన యూనియన్‌ హాస్పిటల్స్‌ ప్రముఖ వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించారు.

తొలుత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, అన్న ఎన్టీఆర్‌ చిత్రపటానికి, ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ, కింజారపు ఎర్రంనాయుడు 12వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు చేసిన సేవలను స్మరించుకున్నారు. అన్న ఎన్టీఆర్‌ స్ఫూర్తితో జాతీయస్థాయిలో ఎర్రంనాయుడు కూడా అత్యుత్తమ సేవలను అందించారని పేర్కొన్నారు. అనంతరం చిరు వ్యాపారులకు తోపుడుబండ్లను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరావు మాట్లాడుతూ … జన్మదినోత్సవాలను పురస్కరించుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అన్న ఎన్టీఆర్‌ తో ఉన్న అనుబంధాన్ని, కింజారపు ఎర్రంనాయుడు చేసిన సేవలను గుర్తు చేశారు. ఎన్డీఏ మహాకూటమి ప్రభుత్వం మహనీయుల బాటలో పయనిస్తూ పేదల సంక్షేమంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమగ్రాభివఅద్ధికి కఅషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లంక లితీష్‌ అనుచరులు జై చంద్రబాబు, జై లోకేష్‌, జై వసంత కఅష్ణప్రసాదు అంటూ నినాదాలు చేశారు. అనంతరం మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు ని, అక్కల గాంధీ ని ఘనంగా సత్కరించారు. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్‌ అక్కల రామ్మోహనరావు (గాంధీ), తెలుగు యువత అధ్యక్షులు లంకా లతీష్‌, ఎన్డీఏ మహాకూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

➡️