త్వరలో కూటమి అధికారం చేపట్టబోతోంది :మాజీ మంత్రి అమరనాథరెడ్డి

May 21,2024 16:01 #chitoor, #meeting, #TDP

ప్రజాశక్తి-వికోట(చిత్తూరు) : రాష్ట్రంలో త్వరలో కూటమి అధికారం చేపట్టబోతోందని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని మాజీ మంత్రి అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన వి.కోటలోని పియంఅర్‌ కళ్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి మాజీ మంత్రి అమరనాథ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎన్నికలలో కష్టపడి పనిచేసిన నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ వి.కోట, బైరెడ్డిపల్లి మండల నాయకులతో ఆయన వేర్వేరు ఆత్మీయ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. జూన్‌ 4న జరగనున్న కౌంటింగ్‌లో కూటమి పార్టీకే సానుకూల ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. పలమనేరు నియోజకవర్గంలో సైతం టిడిపి జెండా ఎగరడం ఖాయమన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు సీఎం కావడం తధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో వి.కోట, బైరెడ్డిపల్లి మండలాల పార్టీ అధ్యక్షులు రంగనాథ్‌, కిషోర్‌ గౌడ్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ రామచంద్ర నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శులు ఈశ్వర్‌ గౌడ్‌, సుబ్రహ్మణ్యం శెట్టి, నాయకులు రాంబాబు, చౌడప్ప, కృష్ణవేణి జయ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️