ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్ : నంద్యాలలో వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో నంద్యాల జిల్లా వైఎస్ఆర్ సిపి ఉపాధ్యక్షుడు డాక్టర్ దాల్మిల్ అమీర్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు, ఆయురారోగ్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సామాజిక సేవ, రాజకీయ రంగంలో గొప్ప వ్యక్తిగా అందరికీ ఆదర్శనీయుడుగా స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని కొనియాడారు. స్వశక్తితో ఉన్నత స్థానాన్ని అధిరోహించారని, అలాగే రాజకీయ రంగంలో ఎందరికో ఆదర్శప్రాయుడిగా గెలిచారని అన్నారు. రాష్ట్ర రాజకీయ రంగంలో తనదైన ముద్రను వేసుకున్న నేత అని పేర్కొన్నారు. విలువలతో కూడిన రాజకీయానికి శిల్ప మోహన్ రెడ్డి చిరునామాగా నిలిచారని అన్నారు. పేద బడుగు, బలహీన వర్గాల ప్రజలకు తన వంతు సేవను అందించాలన్న సమున్నత ఆశయాలతో శిల్పా సేవా సమితిని ప్రారంభించి, వివిధ రంగాలలో వేలాదిమంది నిరుద్యోగులకు, యువతకు ఉపాధి కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపారని తెలిపారు. రాజకీయంలో గెలుపు ఓటములకు అతీతంగా శిల్పా సేవా సమితి ద్వారా నిరంతర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న గొప్ప నాయకుడు అని కొనియాడారు. ఎటువంటి సామాజిక సేవ రాజకీయ దురంధరుడైన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి జీవితం అందరికీ ఆదర్శం, స్ఫూర్తిదాయకంగా నిలవాలని వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైఎస్ఆర్సిపి నంద్యాల జిల్లా జనరల్ సెక్రెటరీ సోమశేఖర్ రెడ్డి, నంద్యాల డిస్ట్రిక్ట్ వైయస్సార్ జనరల్ సెక్రెటరీ ఆర్గనైజర్స్ ,దేవనగర్ బాషా, హరి, వైయస్సార్ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, వైఎస్ఆర్సిపి నంద్యాల జిల్లా మేధావుల ఫోరం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, వైఎస్ఆర్సిపి నంద్యాల జిల్లా మున్సిపల్ లివింగ్ ప్రెసిడెంట్ టివై శివయ్య, వైఎస్ఆర్సిపి నంద్యాల జిల్లా కల్చరల్ వింగ్ ప్రెసిడెంట్ టీవీ రమణ, మరియు వైఎస్ఆర్సిపి కౌన్సిలర్స్ మేష చంద్రశేఖర్ ,షాదిక్ బాషా, కృష్ణమోహన్, విజయభాస్కర్, చంద్రశేఖర్ రెడ్డి, సమ్మద్, కలాం భాష, ఆరిఫ్ నాయక్ ,కోఆప్షన్ సభ్యులు పడకండ్ల సుబ్రహ్మణ్యం , సలాం ముల్ల,వైసిపి నాయకులు నెరవాటి సత్యనారాయణ, సుబ్బ లక్ష్మయ్య, కృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణ, పున్న శేషయ్య, కిరణ్ కుమార్, సుబ్బరాయుడు ,ఎద్దు రవి, దండే సుధాకర్ ,చింత శ్రీనివాసులు, కాల్వ నాగరాజు, రామచంద్రుడు ,శ్రీరాములు ,జాకీర్ హుస్సేన్, రహంతుల్లా , జలీల్, జంబులయ్య, కాసిం, ఆంజనేయులు, భాస్కర్ రెడ్డి, శంకర్ నాయక్ ,గన్ని కరీం ,మహబూబ్ బాషా ,సోహెల్ రానా, సత్యం మరియు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.