మాజీ ఎమ్మెల్యే బుల్లబ్బాయి రెడ్డి మృతి

May 28,2024 11:17 #former MLA, #Kakinada, #passed away

ప్రజాశక్తి -యు.కొత్తపల్లి (కాకినాడ) : మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి నాగులపల్లిలోని తన సొంతింట్లో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ … మంగళవారం తుది శ్వాస విడిచారు. సంపర నియోజకవర్గం ఉన్నప్పుడు రెండు పర్యాయాలు కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మఅతి చెందిన విషయం తెలియగానే నియోజవర్గ ప్రజలు ఆయన చేసిన సేవలు అద్భుతంగా ఉండేవని తెలిపారు. కొత్తపల్లి మండలంలో వివిఎస్‌ విద్యాసంస్థలు ఏర్పాటు చేసి ఎంతోమందికి విద్యను అందించడంలో తనదైన శైలి ముద్రవేశారు. ఎంతోమంది ఉన్నత చదువులకు సహకరించేవారు బుల్లబ్బాయి రెడ్డి మఅతితో మండలంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

➡️