గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి తలకు గాయం

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి నరసరావుపేటలోని ఆయన స్వగృహంలో గురువారం స్నానం చేసేందుకు వెళుతుండగా , కాలు జారిపడిపోవడంతో తలకి గాయం అయింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపారు. నరసరావుపేట మహాత్మా గాంధీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ లో గాయానికి 8 కుట్లు వేశారు. రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

➡️