ప్రజాశక్తి-పలమనేరు (చిత్తూరు) : చిత్తూరు మాజీ ఎంపీ నూతన కాల్వ రామక్రిష్ణా రెడ్డి 87వ జయంతి వేడుకలు పలమనేరులో మంగళవారం ఘనంగా జరిగాయి. పెద్దపంజాణి మండలంలోని కెలవాతిలో పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి తమ కుటుంబీకులతో కలసి రామక్రిష్ణ రెడ్డి స్మృతి వనంలో పూజలు నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పలువురు టీడీపీ నాయకులు సైతం ఆయన్ను స్మరించుకొని జిల్లాకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. అదేవిధంగా పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ నాయకులు ఆయన చిత్ర పటానికి పూజలు చేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాలలో పెద్దపంజాణి, పట్టణ నాయకులతో పాటు జిల్లాకు పలువురు ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
