తిరుపతి సిటీ : హిందువుల మనోభావాలతో జగన్ ఆడుకుంటున్నారని మాజీ రాజ్యసభ సభ్యులు టి.జి.వెంకటేష్ విమర్శించారు. ఆదివారం వెంకటేష్ మాట్లాడుతూ … ఇంట్లో తిరుమల సెట్టింగ్ వేస్తే నిన్ను నమ్మరు జగన్ అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి తనపై వచ్చిన అభియోగాలను ఎందుకు పోగొట్టుకోవడం లేదని అడిగారు. హిందువుల మనోభావాలతో జగన్ ఇంకా ఆడుకుంటున్నారని మండిపడ్డారు. భూమన కరుణాకర్ రెడ్డి నాస్తికుడని, వై.వి.సుబ్బారెడ్డి సతీమణి అన్యమతస్తురాలు అని చెప్పారు. అన్యమతస్తులను ఎందుకు టిటిడి ఛైర్మన్లుగా నియమించారు అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలవడంపై హిందు సమాజం అగ్రహంతో ఉందన్నారు. వైసిపి హయాంలో టిటిడిలో గత ఐదు సంవత్సరాలలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. జగన్ ఎందుకు డిక్లరేషన్ పై రార్థాంతం చేశారని అడిగారు. నెయ్యి వ్యవహారంలో కచ్చితంగా నేరస్తులు శిక్షింపబడతారని స్పష్టం చేశారు. పొట్టి శ్రీరాముల పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి మార్చి వేసి సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టాలన్న తెలంగాణ కేబినెట్ తీర్మానం శోచనీయమన్నారు. భాషా ప్రయుక్త రాష్టాల కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని చెప్పారు. అలాంటి వ్యక్తి పేరును మార్చాలను కోవడం మంచి పద్దతి కాదు అని అన్నారు. పొట్టి శ్రీరాముల పేరును మార్చడాన్ని వెంటనే ఉప సహారించుకోవాలని డిమాండ్ చేశారు. సురవరం ప్రతాప్ రెడ్డి పేరును మార్చాలనుకుంటే ఇంకో సంస్థకు పెట్టుకోండి అని అన్నారు. నామినేటెడ్ పోస్టులకు తాను అనర్హుడిని అని, గవర్నర్ గా పనిచేయాలన్న ఆలోచన తనకు లేదని అన్నారు.