సీబీఎస్‌ఈ ఫలితాలలో ‘ఫోర్ట్‌ సిటీ’విజయకేతనం

May 14,2024 15:47 #vijayanagaram

ప్రజాశక్తి- విజయనగరం టౌన్‌ :సోమవారం విడుదల చేసిన సీబీఎస్‌ఈ టెన్త్‌ పరీక్షా ఫలితాలలో ఫోర్ట్‌ సిటీ పాఠశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు ..సీపాన తీక్షణ 500 మార్కులకు 485 మార్కులతో పాఠశాల ప్రథమ స్థానాన్ని, ఎన్‌.ఎం.ఎన్‌. వరుణ్‌ మైలవరపు 484 మార్కులతో ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. శతశాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా పరీక్షకు హాజరైన 66 మంది విద్యార్థులలో 63 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు .విద్యార్థులను అభినందించిన ఈ కార్యక్రమంలో పాల్గన్న పాఠశాల చైర్మన్‌ కె.ఎ.పి.రాజు ( శివ )మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులు పదవ తరగతి స్టేట్‌ పరీక్షా ఫలితాలలో మాత్రమే కాకుండా సీబీఎస్‌ఈ పరీక్షా ఫలితాలలో కూడా మంచి మార్కులు సాధించడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గన్న వైస్‌ చైర్మన్‌ చంటి, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రోయినా ఖాన్‌, డైరెక్టర్లు మధు, అశోక్‌, నీలిమ లు విద్యార్థులను, తల్లిదండ్రులను , పాఠశాల సిబ్బందిని అభినందించారు.

➡️