డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన

డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన

ప్రజాశక్తి -అనంతగిరి : మండలంలోని టోకూరు పంచాయతీ కేంద్రంలో ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల వద్ద డ్రైనేజీ నిర్మాణ పనులకు మంగళవారం స్థానిక సర్పంచ్‌ కిల్లో మొస్య ఆధ్వర్యంలో జెడ్‌పిటిసి దీసరి గంగరాజు శంకుస్థాపన చేశారు. డ్రైనేజీ నిర్మాణానికి జిల్లా పరిషత్‌ నిధుల నుంచి జెడ్‌పిటిసి గంగరాజు చొరవతో రూ.7.50లక్షలను మంజూరు చేశారు.ఈ సదంర్భంగా జెడ్‌పిటిసి గంగరాజు మాట్లాడుతూ, టోకూరు బాలికల ఆశ్రమపాఠశాల విద్యార్థినులు మురుగు కాలువ లేకపోవడంతో దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సర్పంచ్‌తోపాటు స్థానికులు తన దృష్టికి తేవడంతోపాటు స్వయంగా ఇక్కడ పరిస్థితులను పరిశీలించిన తాను జిల్లా పరిషత్‌ నుంచి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. పనులను నాణ్యతతో చేపట్టి, సకాలంలో పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కాగా టోకూరులో అభివృద్ధి పనులకు జిల్లా పరిషత్‌ నిధులను కేటాయించిన జెడ్‌పిటిసి దీసరి గంగరాజుకు గ్రామప్రజలు, ఆశ్రమ పాఠశౄల విద్యార్థినుల తరపున సర్పంచ్‌ కిల్లో మొస్య ధన్యవాదాలు తెలిపారు. పంచాయతీ అభివృద్ధికు మరింత నిధులు కేటాయించి సహకరించాలని కోరారు కార్యక్రమంలో వైస్‌సర్పంచ్‌ జి, నర్సన్న వార్డు సభ్యులు పాంగి, లక్ష్మణరావు, ప్రసాద్‌, మాజీ సర్పంచ్‌ ఎస్‌,దొన్ను, సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌, నాగులు మండల నాయకులు జి.దేవన్న, కార్యకర్తలు టిడిపి మండల నాయకులు ఎస్‌.దోన్ను సచివాలయం సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు

శంకుస్థాపన చేస్తున్న జెడ్‌పిటిసి గంగరాజు, సర్పంచ్‌ మొస్

➡️