ఆటో బోల్తాపడి నలుగురికి గాయాలు

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : పుట్లూరు మండల పరిధిలోని ఏ.కొండాపురం వద్ద ఆటో బోల్తాపడడంతో నలుగురికి గాయాలయ్యాయి. అనంతపురం గ్రామానికి చెందిన రామమోహన, రామదేవి, కార్తీక్‌, జగన్‌ ఆటో డ్రైవర్‌ రవితో కడప జిల్లా తాళ్ల పొద్దుటూరు కి శనివారం వెళ్లి ఆదివారం తిరిగి వస్తుండగా ఏ కొండాపురం గ్రామం వద్ద రాగానే స్టీరింగ్‌ ఊడిపోవడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

➡️