తిరుపతి : రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలైన సంఘటన తిరుపతిలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే తిరుపతిలోని వెదురుకుప్పం మండలంలో గల తిరుమలయ్య పల్లి స్కూల్ లో పనిచేసే ఉపాధ్యాయులు వెళ్తున్న కారు అదుపుతప్పి మంగళవారం బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు ఉపాధ్యాయులకు స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
