ప్రజాశక్తి-టంగుటూరు: ఒంగోలు మండలంలోని వెంగముక్కపాలెం పరిధిలో ఓగూరు వెంకటేశ్వర్లుకి చెదిన పెట్రోలు బంకు నిర్మాణ దశలో ఉంది. ఆదివారం రాత్రి వీచిన పెనుగాలికి పెట్రోలు బంకు వద్ద ఉన్న విద్యుత్ తీగ ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో తెగి పడింది. విద్యుత్ తీగ తెగిన విషయం తెలియని ఓగూరి వెంకటేశ్వర్లు నీటి గుంత వద్ద ఉన్న తీగ తగిలి గుంటలో పడి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటేశ్వర్లు ఇంటి వద్దకు ఎంతకు రాకపోవడంతో ఆందోళనతో వారి కుమారుడు భరత్‌తో పాటు నలుగురు వెతుకుతూ పెట్రోలు బంకు వద్దకు వచ్చారు. చీకటిలో నీటిలో కొట్టు మిట్టాడుతున్న వెంకటేశ్వర్లుని గుర్తించిన యువకులు నీటి గుంతలోకి దూకారు. దీంతో వారిలో మరో ముగ్గురికి షాక్‌తో గాయాల పాలయ్యాయి. గుంతలో నుంచి బయటకు వచ్చి వైద్య చికిత్స కోసం ఒంగోలులోని సంఘమిత్ర వైద్యశాలలో చేరారు. ఒగూరు వెంకటేశ్వర్లుకి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం చెన్నైకి అంబులెన్స్‌లో తరలించనున్నట్లు వెంకటేశ్వర్లు కుమారుడు భరత్ తెలిపారు. స్పందించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌వెంగముక్కపాలెంలో విద్యుత్ షాక్ ఘటనపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించి అధికారులను అప్రమత్తం చేశారు. బాధితులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా యస్‌ఈ, సిఎమ్‌డిని ఆదేశించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను విద్యుత్ శాఖ ఎస్‌ఇ కట్టా వెంకటేశ్వర్లు పరామర్శించారు.
