సుజయ కృష్ణకు ఫారెస్ట్ డెవలప్‌మెంట్
తెంటుకు బుడా
గ్రీష్నకు కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్
యశస్వికి కాపు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌పదవులు
ప్రజాశక్తి- బొబ్బిలి/విజయనగరంటౌన్/రేగిడి : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్ పదవులు జిల్లాలో నలుగురికి దక్కాయి. బొబ్బిలి నియోజకవర్గం నుంచి మాజీమంత్రి సుజయ కృష్ణ్ణరంగారావు, తెంటు లక్ష్మునాయుడుకు లభించాయి. రాష్ట్ర ఫారెస్ట్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా సుజరుకృష్ణ రంగారావును, బుడా చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడును నియమించింది. వారి నియామకం పట్ల టిడిపి నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎపి ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా గ్రీష్మ రాజాం నియోజకవర్గానికి చెందిన టిడిపి నాయకులు కావలి గ్రీష్మను ఎపి ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్‌గా కూటమి ప్రభుత్వం నియమించింది. ఈమె మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి కుమార్తె. తన తల్లి అడుగుజాడల్లో రాజకీయాలలో తనదైన శైలలో వ్యవహరించి టిడిపిని బలోపేతం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించి బంగపడ్డారు. గ్రీష్మ సేవలను గుర్తించి చైర్‌పర్సన్ పదవి ఇవ్వడం పట్ల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందిం చారు. కార్పొరేషన్ సేవలను మరింత ప్రజలకు అందించి, అందరు సహకారంతో ముందుకు నడిపిస్తానని ప్రజాశక్తితో ఆమె అన్నారు.తూర్పు కాపు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా యశస్వి ప్రజాశక్తి-విజయనగరం టౌన్ తూర్పు కాపు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జనసేన నాయకురాలు పాలవలస యశస్విని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో అడ్వకేట్‌గా ఉన్న యశస్వి 2019 ఎన్నికల్లో విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. 2019 నుండి 2024 ఎన్నికల వరకు జనసేన పార్టీ కార్యక్రమా లను జిల్లాలో క్షేత్రస్థాయిలో నిర్వహించేందుకు ఆమె కృషి చేశారు. ఈనేపథ్యంలోనే ఆమెకు తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని కేటాయించారు. ఈసందర్భంగా ఆమెకు జనసేన కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
నాగార్జున, గొంపకు దక్కని పదవులు
విచారంలో మరి కొందరు తమ్ముళ్లు
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : తాజాగా టిడిపి కూటమి ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో గత ఎన్నికల్లో పార్టీకోసం అత్యంత కీలకంగా పనిచేసిన టిడిపి జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున, ఎస్.కోట నియోజకవర్గానికి చెందిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప క్రిష్టకు చోటు దక్కలేదు. వీరితోపాటు విజయనగరంలో ఐవిపి రాజు, డెంకాడకు చెందిన చెందిన కంది చంద్రశేఖర్, గజపతినగరానికి చెందిన కరణం శివరామ కృష్ణ, పార్వతీపురంలో ద్వారపురెడ్డి జగదీష్ కూడా కంగుతిన్నారు. గతంలో నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త కర్రోతు బంగార్రాజుకు మాత్రమే మార్కెఫెడ్ చైర్మన్‌గా నామినేటెడ్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం ప్రకటించిన జాబితాలో విజయనగరం జిల్లాలో ముగ్గురు టిడిపి నాయకులకు, ఒక జనసేన నాయకురాలికి అవకాశం దక్కింది. మాజీ మంత్రి ఆర్‌విఎస్‌కె రంగారావుకు ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గాను, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడుకు బుడా చైర్మన్‌గాను, జనసేన నాయకులు పాలవలస యశశ్వినికి తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మెన్‌గా పాలవలస యశశ్విని, రాజాంకు చెందిన కావలి గ్రీష్మలకు ఎపి ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా పదవులు దక్కాయి. ఈ నేపథ్యంలో మిగిలిన నాయకులు నిరాశ చెందుతున్నారు. ముఖ్యంగా నాగార్జున, గొంప క్రిష్ణలకు పదవులు రాకపోవడంపై వారి అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. మూడవ దఫాలో వీరిద్దరికీ కాస్త సముచిత స్థానమే లభిస్తుందన్న చర్చకూడా కొందరి నాయకుల నోట వినిపిస్తోంది. కరణం శివరామకృష్ణ గజతిపతినగరం నియోజకవర్గ కోటాలో నామినేటెడ్ పదవి కోసం చాలా కాలంగా ఆశపడుతున్నప్పటికీ రెండు దఫాలు అవకాశం దక్కలేదు. ఐవిపి రాజుకు ఇప్పటి వరకు పార్టీ పదవులు తప్ప ప్రభుత్వ పదవులేవీ దక్కలేదు. దీంతో, ఆయన అభిమానుల్లోనూ నిరాశ ఉంది. పార్వతీపురం నుంచి జగదీష్‌తోపాటు చిరంజీవులు కూడా పదవి ఆశించారు. కానీ వీరికి నిరాశ ఎదురైంది. బొబ్బిలిలో ఎన్నికల సభలో లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం లక్ష్మునాయుడుకు బుడా చైర్మన్‌గా పదవి దక్కింది.