రూ.8 లక్షల వార్షిక వేతనంతో నలుగురు గుడ్లవల్లేరు పాలిటెక్నిక్‌ విద్యార్థుల ఎంపిక

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణా) : బహుళ జాతీయ సంస్థ థాట్‌ వర్క్స్‌ టెక్నాలజీస్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారు గుడ్లవల్లేరు ఎ.ఎ.ఎన్‌.ఎమ్‌ అండ్‌ వి.వి.ఆర్‌.ఎస్‌.ఆర్‌. పాలిటెక్నిక్‌ లో సుమారు 400 మంది విద్యార్థులకు ప్రాంగణ ఎంపికలు నిర్వహించగా వారిలో నలుగురు కంప్యూటర్‌ విద్యార్థులు జి.మోహంతి, జి.రష్మిక, జి.జ్యోతి ప్రవీణ్‌, జి.చిరంజీవి లు వివిధ అంశాలలో పోటీపడి వార్షిక ఆదాయం రూ.8,00,000 వేతనంతో ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉందని అదేవిధంగా వీరి కఅషి, పట్టుదలే ఇంతటి మంచి ఉద్యోగాలు సాధించడానికి దోహదపడ్డాయని ప్రిన్సిపాల్‌ ఎన్‌.రాజశేఖర్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్మెంట్‌ ఆఫీసర్‌ ఎమ్‌.వినరు ని, ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను, కంప్యూటర్‌ విభాగాధిపతి ఎ.కృష్ణ చైతన్యలను యాజమాన్య సభ్యులు చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరావు వల్లూరిపల్లి, సెక్రటరీ కరస్పాండెంట్‌ సత్యనారాయణ రావు వల్లూరుపల్లి, కో-సెక్రెటరీ కరస్పాండెంట్‌ వల్లూరిపల్లి రామకృష్ణ , ఎగ్జిక్యూటివ్‌ మెంటార్‌ .రామాంజనేయులు, ప్రిన్సిపాల్‌ ఎన్‌.రాజశేఖర్‌ అభినందించారు.

➡️