ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి: గుంటూరు నగర శివారు ఏటుకూరు – ప్రత్తిపాడు రోడ్డు శుక్రవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢ కొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు గాయపడ్డారు. మృతులు కుర్నూతలకు చెందిన పత్తి మిల్లు కార్మికుడు బలరాం (34), ఏసీ కాలేజీ పీజీ విద్యార్థి దావీదు (22), మరో ముఠా కార్మికుడు గోవర్ధన్ (20)గా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. నల్లపాడు సిఐ వంశీధర్ ఘటనా స్థలిని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మంగళగిరి సమీపంలోని ఎన్నారై వై జంక్షన్ నేతన్న సర్కిల్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢకొీనిఒకరు మృతి చెందారు.
