ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : దసరా శరన్నవరాత్రి మహౌత్సవాలలో విజయవాడ ఇంద్రకీలాద్రి పై కొలువైన దుర్గమ్మ తల్లి ని దర్శించుకున్న భక్తులకు టీవీసి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలురకాల మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. కడియం మండలం బుర్రిలంక కు చెందిన ఈశ్వరా నర్సరీ అధినేత, టివిసి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు తాడాల విష్ణు చక్రవర్తి సమకూర్చిన మొక్కలు తన కుటుంబ సభ్యులు విజయవాడ వెళ్లి స్వయంగా పంపిణీ చేశారు. వివిధ పూజలు, వ్రతాలు, నోములకు ఉపయోగపడే కదంబ, తులసి, మారేడు, నేరేడు, ఉసిరి, జమ్మి వంటి వివిధ రకాల వేల మెక్కలను ఉచితంగా పంపిణీ చేసిన టివిసి ట్రస్ట్ చక్రవర్తి కుటుంబ సభ్యులను ఆలయ ఇఓ, డిప్యూటీ కలెక్టర్ కెఎస్.రామారావు, ఈఈ కెవిఎస్‌ఆర్ మూర్తి, రమాదేవి, డిప్యూటీ ఇఇ రవీంద్ర, ఎఇ రామకృష్ణ, భానుచందర్ తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అభినందించారు.