ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రాష్ట్ర సాంఘిక – గిరిజన సంక్షేమ శాఖలు సంయుక్త ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ విధానంలో ఎస్.సి, ఎస్.టి అభ్యర్థులకు డి.ఎస్.సి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పల్నాడు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి బి.శివ నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ కోసం ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను https://jnanabhumi.ap.gov.in జ్ఞానభూమి వెబ్ పోర్టల్ లో https://mdfc.apcfs.in లో చూసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు రేపటి లోగా (ఈ నెల 15 ) శిక్షణ కేంద్రాన్ని ఎంపిక చేసుకుని ప్రాధాన్యతను ఆన్‌లైన్‌లో ఎంచుకోవాలని సూచించారు.
రెసిడెన్షియల్ లో ఎస్.సి, ఎస్.టి అభ్యర్థులకు ఉచిత డి.ఎస్.సి శిక్షణ
