గుండెపోటు రోగులకు ఉచిత ఇంజక్షన్‌

ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : మండల కేంద్రమైన కడియం సామాజిక ఆరోగ్య కేంద్రంలో గుండెపోటు (హార్ట్‌ ఎటాక్‌)కు గురైన రోగులకు ఈసీజీ పరీక్ష నిర్వహించి, తద్వారా గుండెపోటు నిర్ధారణ చేసిన తదుపరి 45 వేల రూపాయలు విలువగల టెనెక్టెప్లేజ్‌ ఇంజక్షన్‌ ఉచితముగా చేయబడుతుందని, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి. రత్న మాధురి తెలియజేశారు. గత సంవత్సర కాలంలో కడియం సామాజిక ఆరోగ్య కేంద్రం నందు గుండెపోటుకు గురైన నలుగురు రోగులకు ఈ ఇంజక్షన్‌ ఉచితంగా అందజేసి రక్షించడం జరిగిందన్నారు. గుండెపోటుకు గురైన రోగులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణం దగ్గరలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రంకు వచ్చి ఈ విలువైన సేవలను వినియోగించుకోవాలని డాక్టర్‌ జి రత్న మాధురి కోరారు.

➡️