ఉచిత వైద్య శిబిరం

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు: మండలంలోని చీర్వానుప్పలపాడు పంచాయతీ పరిధిలోని టి.అగ్రహరంలో పొద లింగయ్య జ్ఞాపకార్థం, ఎంపీటీసీ పొద పవన్‌ ఆధ్వర్యంలో కిమ్స్‌ హాస్పిటల్‌ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం సోమవారం నిర్వహించారు. ఈ శిబిరంలో 250 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 45 మందికి ఆపరేషన్‌లు అవసరమని నిర్ధారించారు. ఒంగోలు కిమ్స్‌ హాస్పిటల్‌లో వీరికి ఆరోగ్యశ్రీ, ఈఎస్‌ఐ, ఈహెచ్‌ఎస్‌, ఈసిహెచ్‌ఎస్‌, రైల్వే ఇన్సూరెన్స్‌ కార్డుల ద్వారా ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరికి కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందిస్తామని కిమ్స్‌ హాస్పిటల్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ షేక్‌ రఫీ తెలిపారు. ఈ క్యాంపులో ఆప్తమాలజిస్ట్‌ హైందవి, సాధారణ వ్యాధి నిపుణులు డాక్టర్‌ రామాంజనేయులు, కిమ్స్‌ హాస్పిటల్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️