ఉచిత వైద్య శిబిరం

ప్రజాశక్తి-అద్దంకి:  ఐఈఈఆర్‌డి స్వచ్ఛంద సేవా సంస్థ, ఆయుష్‌ శాఖ సం యుక్త ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని నంబూరువారి పాలెంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్‌ ఆర్‌.శకుంతల, డాక్టర్‌ ఏ కరుణాకర్‌ రావు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిం చి 110 మందికి ఉచితంగా ఆయుర్వేద మందులు, ఔషధ మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్‌ బత్తుల కిరణ్‌ చంద్‌ మాట్లాడుతూ నేటి సమాజంలో ఆరోగ్య సమస్యల వల్ల అనేకమంది మానసికం గా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. డాక్టర్‌ ఆర్‌.శకుంతల మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్రకృతి ప్రసాదించిన ఆయుర్వేద మూలికలు, ఆయుర్వేద మందుల ద్వారా ఆరోగ్య ప్రయోజ నాలు పొందాలన్నారు. డాక్టర్‌ ఏ.కరుణాకర్‌ మాట్లాడుతూ ఆయుర్వేదం ద్వారా మన పూర్వీకులు 100 సంవత్సరాలకు పైగా ఆరోగ్యవంతులుగా ఉన్నారన్నారు.

➡️