నూజివీడులో ఉచిత వైద్య శిబిరం

Jan 10,2025 11:29 #Free medical camp, #Noojiveedu

ప్రజాశక్తి-నూజివీడు టౌన్‌ (ఏలూరు) : ఈనెల 11వ తేదీ శనివారం రోజున నూజివీడు పట్టణంలో ఉచిత వైద్య శిబిరం బాపు నగర్‌ బమ్మల సెంటర్‌ వద్ద ఏర్పాటు చేయనున్నట్లు ఆకుల రామదాసు సేవా ట్రస్ట్‌ ఫౌండర్‌ చైర్మన్‌ మరియు సమాచార హక్కు చట్టం కార్యకర్త ఆకుల భీమశంకర్‌ రావు, ఆకుల ఆంజనేయ ప్రసాద్‌ (నాని) లు తెలిపారు. నూజివీడులో వారు శుక్రవారం మాట్లాడుతూ విజయవాడ నగరానికి చెందిన ఐ అండ్‌ జనరల్‌ కేర్‌ ఎన్‌ఎస్‌ హాస్పిటల్‌ వారి సౌజన్యంతో ఉచిత మెడికల్‌ క్యాంపు నిర్వహించనున్నట్లు చెప్పారు. అత్యవసర విభాగ వైద్యులు డాక్టర్‌ ఎస్‌ కే నాయబ్‌ రసూల్‌, కంటి చికిత్స నిపుణులు డాక్టర్‌ జమ్‌ రుద్‌ షాహిన్‌ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేయనున్నట్లుగా వివరించారు. ఈ క్యాంపులను నూజివీడు పట్టణంలోని బాపునగర్‌, నెహ్రుపేట, అజరయ్య పేట, బంగినపల్లి తోట, కొత్తపేట, ఆర్‌ఆర్‌ పేట, ఎన్టీఆర్‌ కాలనీ వాసులు, ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ వైద్య శిబిరం శనివారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం వరకు కొనసాగుతుందని వివరించారు. ఈ క్యాంపులలో ఫస్ట్‌ ఎయిడ్‌ మరియు ట్రామా మేనేజ్మెంట్‌, ఐసీజీ మరియు కార్డియాక్‌ మానిటరింగ్‌, వివి మెడికేషన్స్‌, నెబ్యులైజేషన్‌, డయాబెటిస్‌, హైపర్‌ టెన్షన్‌ స్క్రీనింగ్‌ అండ్‌ మేనేజ్మెంట్‌, కంప్యూటర్‌ విజన్‌ టెస్టింగ్‌, ఆప్టికల్స్‌ కాంటాక్ట్‌ లెన్స్‌, ఎండోస్కోపి, రెటినోపతి స్క్రీనింగ్‌, గ్లోకోమా స్క్రీనింగ్‌, అడ్వాన్సుడ్‌ కాటరాక్ట్‌ సర్జరీ, పేట రీజియం సర్జరీ విత్‌ ఏసీజీ వంటి పరీక్షలు నిర్వహించటం జరుగుతుందన్నారు. ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.

➡️