చిన్నపిల్లల ఉచిత మెడికల్ క్యాంపు

Feb 11,2024 15:30 #Tirupati district

ప్రజాశక్తి-పాకాల (తిరుపతి) :మండలంలోని చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే పార్టీలకు అతీతంగా హెల్త్ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని పులివర్తి సుధా రెడ్డి అన్నారు.పట్టణ కేంద్రంలోని నీలామాలతి కల్యాణ మండపం వద్ద చిన్నపిల్లల డాక్టర్ పులివర్తి త్రిష్య రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం చిన్నపిల్లల ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు.ఈ సందర్భంగా పులివర్తి సుధా రెడ్డి మాట్లాడుతూ 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత వైద్య చికిత్స మందులు పంపిణీ చేసి,ప్రతి ఆరు నెలలకి ఈ ఉచిత మెగా వైద్య శిబిరం చిన్నపిల్లల కోసం నిర్వహించడం డాక్టర్ పులివర్తి త్రిష్య రెడ్డి బాధితులు తీసుకుంటారని అన్నారు. స్థానిక దినసరి కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న నీలామాలతి కల్యాణ మండపంలో ఆదివారం టిడిపి చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ సతీమణి,డాక్టర్ పులివర్తి త్రిష్య రెడ్డి ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది అని అన్నారు. పార్టీ కోసమో,ఓట్ల కోసమో ఈ ఉచిత వైద్య మెగా శిబిరం నిర్వహించడం లేదని,సేవా భావంతోనే చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని అన్నారు.ప్రతి ఆరు నెలలకి ఈ ఉచిత మెగా వైద్య శిబిరం చిన్నపిల్లల కోసం నిర్వహించడం నా బాధ్యత అని అన్నారు.టైమ్ పాస్ కు క్యాంపులు ఏర్పాటు చేసి,తాయిలాలు ఇచ్చి ఓట్లు అడిగే సిద్దాంతం తెలుగుదేశం పార్టీది కాదన్నారు.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో హాస్పిటల్ నిర్మాణం కోసం పాకాల మండలంలో శిలాఫలకం వేశారని గుర్తు చేశారు.45 వేల మంది జనాభా ఉన్న పాకాల మండలంలో పూర్తి స్థాయి వసతులతో హాస్పిటల్ లేదన్నారు.ఉన్న పి‌.హెచ్.సి లో వైద్యులు,మందులు అందుబాటులో లేవని,విద్య,ఉద్యోగం,వైద్యం ఈ మూడు అంశాలు పులివర్తి నాని ముందున్న లక్ష్యమన్నారు.పిల్లలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా పీలేరు,చిత్తూరు,తిరుపతి వైపు పరుగులు తీయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వైద్య బృందం,టిడిపి,జససేన నాయకులు,కార్యకర్తలు,మహిళా నాయకురాలు పాల్గొన్నారు.

➡️