ఎమ్మెల్యే ఉగ్ర ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ప్రజాశక్తి-కనిగిరి: జననీ చారిటబుల్‌ ట్రస్ట్‌, శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్త సహకారంతో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముకు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అమరావతి గ్రౌండ్స్‌లో శుక్రవారం మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కంటి వైద్య శిబిరంలో పాల్గొన్న వృద్ధులకు శంకర కంటి ఆసుపత్రి వైద్యులు బిపిన్‌ కంటి వైద్య పరీక్షలు చేశారు. 73 మందికి కొత్తగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 59 మందిని కంటి ఆపరేషన్లకు ఎంపిక చేశారు. ఆపరేషన్‌కు ఎంపికైన వారిలో మొదటి విడతగా 14 మంది, ఈ నెల 20వ తేదీన 45 మందిని ప్రత్యేక వాహనాల్లో శంకర కంటి ఆసుపత్రికి తరలించనున్నారు. ముందుగా గత నెలలో కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారికి కంటి వైద్య పరీక్షలు చేసి ఉచిత కళ్లద్దాలు పంపిణీ, చుక్కల మందులు అందజేశారు. కార్యక్రమంలో వలంటీర్లుగా నాగబాబు, షేక్‌ జంషీర్‌ అహ్మద్‌, అశోక్‌, రెహ్మాన్‌, దొరసాని, తులసి, పార్వతి, కరిముళ్ల, షేక్‌ షరీఫ్‌, శంకర కంటి ఆసుపత్రి పారా మెడికల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️