ప్రజాశక్తి -తగరపువలస : స్థానిక శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆర్య వైశ్య సేవా సంఘం ఆధ్వర్యాన మెయిన్ రోడ్డులోని శ్రీనివాస హెల్త్ కేర్‌లో ఆదివారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. 150 మందికి డాక్టర్ సిహెచ్ నవీన్‌గుప్తా, డాక్టర్ పి.ప్రవీణ, డాక్టర్ ప్రశాంత్ వైద్య పరీక్షలు ఉచితంగా చేశారు. రూ.1500 విలువైన న్యూరోపతి స్క్రీనింగ్, రూ.500 లు విలువైన హెచ్‌బిఎ1సి పరీక్షలు చేశారు. ఆరోగ్య పరంగా వైద్యులు పలు సూచనలు చేశారు.లోడగలవానిపాలెంలో 500 మందికి వైద్య పరీక్షలు ఆనందపురం: ఆనందపురం మండలం లోడగలవానిపాలెంలో ఉమానారాయణ్ ఫౌండేషన్ ఆధ్వర్యాన ఆదివారం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 500 మందికిపైగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వర్ధమాన సినిదర్శకుడు బొమ్మిడి శ్రీతారక్ తన తల్లిదండ్రులైన మాజీ సర్పంచ్ బమ్మిడి సూర్యనారాయణ, మాజీ జడ్‌పిటిసి బమ్మిడి ఉమాదేవి పేరు మీద పొండేషన్‌ను స్థాపించి పలు సేవా కార్యాక్రమాలు చేయనున్నట్లు శ్రీతారక్ తెలిపారు. భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. బృంద హస్పిటల్ డాక్టర్లు వైద్య సేవలందించారు. ఈ కార్యక్రమంలో పెట్రోలియం యూనివర్సిటీ మాజీ చైర్మన్ డాక్టర్ విఎస్‌ఆర్‌కె.ప్రసాద్, ఆనందపురం సిఐ తిరుపతిరావు, నాయకులు కోరాడ రాజాబూబు, చిక్కాల విజయబాబు, మాజీ వైస్ ఎంపీపీ మీసాల సత్యనారాయణ, కాకర వెంకటరమణ, వెల్లంకి సర్పంచ్ ఉప్పాడ లక్ష్మణరావు, ఎంపిటిసి సభ్యులు పడాల అప్పలనాయుడు, జైజవాన్ ఫౌండేషన్ సభ్యులు కుప్ప రామలక్ష్మి పాల్గొన్నారు.
