104 ద్వారా ఉచిత వైద్య సేవలు

Jun 8,2024 22:00
ఫొటో : వైద్య సేవలు నిర్వహిస్తున్న సిబ్బంది

ఫొటో : వైద్య సేవలు నిర్వహిస్తున్న సిబ్బంది
104 ద్వారా ఉచిత వైద్య సేవలు
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని పొంగూరు గ్రామంలో 104 ద్వారా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్‌ శాంతి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. రోగులకు పలురకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. గ్రామంలో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి చూపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో హెల్త్‌ అసిస్టెంట్లు, ఎఎన్‌ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.

➡️