ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ (తూర్పు గోదావరి) : రాజమహేంద్రవరంలోని స్థానిక ఐ. ఎల్. టి.డి సెంటర్ నందు ఉన్న యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నందు ఉచిత టైలరింగ్ శిక్షణ ఈనెల 20వ తారీకు నుండి ప్రారంభమవుతుందనీ సంస్థ డైరెక్టర్ తాడి. శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ … ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులకు మాత్రమే అర్హులని అదేవిధంగా శిక్షణ కాలంలో భోజనం, వసతి పూర్తిగా ఉచితమని 20 సంవత్సరాలు నుండి 45 సంవత్సరాల వయసు కలిగి, తెల్ల రేషన్ కార్డు, కనీసం 9వ తరగతి లేదా ఎనిమిదవ తరగతి చదివి ఉండాలని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సంస్థ డైరెక్టర్ తాడి. శ్రీనివాసరావు తెలిపారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 0883-242024, 2428807 ,9701359954, 7780599939.
