ప్రజాశక్తి – కడప : గొప్ప చరిత్ర కలిగిన రామిరెడ్డి ఫార్మసీ కళాశాలలో సీటు వచ్చింది, మంచి ఆలోచనలతో, ఆచరణతో జీవితంలో అనుకున్నది సాధించాలని జిల్లా ఉపాధి అధికారి ఏ. సురేష్ కుమార్ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం ఊటుకూరు ప్రకృతి నగర్ లో గల రామిరెడ్డి ఫార్మసీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఉపాధి అధికారి ఏ. సురేష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన గావించి ఫ్రెషర్స్ డే వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … కళాశాల చాలా మంచిది అని, పిల్లలు నాలుగు సంవత్సరములు కష్టపడి నలభై సంవత్సరములు ఆనందంగా జీవించాలని ఉద్బోధించారు. రామిరెడ్డి ఫార్మసీ కళాశాల స్థాపించి ముప్పై సంవత్సరాలు అయిందని, గొప్ప చరిత్ర కలిగిన కళాశాల లో మీకు సీట్ వచ్చిందని , మంచి ఆలోచనలతో ఆచరణతో జీవితం లో అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. యాజమాన్య కమిటీ ఇన్ చైర్మన్ ఈశ్వర రెడ్డి, కరస్పాండెంట్ గౌతం రెడ్డి, సెక్రటరీ జయసుబ్బరెడ్డి లు మాట్లాడుతూ నేషనల్ లెవెల్ జీపట్ లో రాంక్ సాధిస్తే మొత్తం ఫీస్ వాపసు చేస్తామని విద్యార్థుల హర్షాతిరేకాలు మధ్య మాట ఇచ్చారు. కళాశాల ప్రధానోపాధ్యాయులు నెల్సన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు కళాశాల లో అందుబాటు లో ఉన్న అవకాశాలు ఉపయోగించుకొని రీసెర్చ్ మీద శ్రద్ధ చూపాలి అని తెలియచేశారు. చివరి అంకంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఎంతగానో అలరించాయి, ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆచార్యులు నరసింహ, మనోహర్ ,రాజారాం, సలోమి, సుమలత, విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.