అంగన్వాడీ కేంద్రాలకు ఫ్రిజ్ లు అందజేత

Apr 15,2025 17:35 #Konaseema

ప్రజాశక్తి – ఆలమూరు : మండలంలోని గుమ్మిలేరు సర్పంచ్ గుణ్ణం రాంబాబు స్థానిక రెండు అంగన్వాడీ కేంద్రాలకు మంగళవారం ఫ్రిజ్ లు అందజేశారు. ఆయన సొంత నిధులు సుమారు 40వేల రూపాయలతో ఫ్రిజ్ లను కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అందిస్తున్న పాలు, గుడ్లు, ఇతర సామాగ్రిలను భద్రపరుచుకునేందుకు ఈ ఫ్రిజ్ లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వై.అరుంధతి, అంగన్వాడీలు, ఏఎన్ఎం, ఆశాలు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

➡️