విమ్స్ ఆస్పత్రిలో 20 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు
మందులు, ఆక్సిజన్ సిలిండర్లను సిద్ధం చేసిన అధికారులు
వైరస్‌పై ఆందోళన వద్దు : విమ్స్ డైరెక్టర్ రాంబాబు
ప్రజాశక్తి – అరిలోవ : దేశంలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ (హెచ్‌ఎంపివి) కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్‌లో వేలాది మందికి వైద్యం అందించిన విమ్స్ ఆస్పత్రి యంత్రాంగం అప్రమత్తమైంది. ముందుస్తు చర్యగా విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు ఆదేశాల మేరకు ఆస్పత్రిలో 20 పడకలతో ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. కోవిడ్ సమయంలో ఏర్పాటు చేసిన (నిమిషంలో 60 లీటర్ల ఆక్సిజన్ అందించే హై ఫ్లోన్యాసల్ కాన్యులాను కూడా సిద్ధం చేశారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు. ప్రత్యేక వార్డును విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు సందర్శించి, ఏర్పాట్లపై పరిశీలించారుఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ వైరస్‌పై వస్తున్న వదంతులు నమ్మవద్దని, ఇది ప్రాణాంతకం కాదని, సాధారణ ఫ్లూ వైరస్ లక్షణాలే కనిపిస్తాయని స్పష్టం చేశారు.
వైరస్ లక్షణాలు..
జ్వరం, గొంతునొప్పి, ముక్క దిబ్బడ, ఆయాసం వంటివి వైరస్ లక్షణాలు. వైరస్ సోకిన వారికి రిబావిరిన్, అజిత్రో మైసిన్ లాంటి మందులతో చికిత్స అందిస్తారు. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉంది. హైరిస్క్ గ్రూపులకు చెందిన హెచ్‌ఐవి, క్షయవ్యాధి, డయాలసిస్ రోగులు, సిఒపిడి, ఆస్తమా రోగులు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు హెచ్‌ఎంపివి వైరస్ బారిన పడే అవకాశం ఉంది
.తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చేతులు పరిశుభ్రత పాటించాలి. మాస్క్‌లు ధరించాలి. బహిరంగ ప్రదేశాల్లో తుమ్మడం, దగ్గడం చేయ కూడదు.వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వ్యాధినిర్థారణ పరీక్షలు చేయించుకుని, పాజిటివ్‌గా తేలితో ఐసోలేషన్‌లో తగు వైద్యం పొందాలిఆందోళన వద్దుహెచ్‌ఎంపివి సాధారణ జలుబు లాంటిది.
భయాందోళన అవసరం లేదు.
కోవిడ్ మాదిరిగానే జాగ్రత్తలు తీసుకుంటో సరిపోతుంది. పిల్లలు, వృద్ధులు, హైరిస్క్ గ్రూపు వారు అప్రమత్తంగా ఉండాలి. ముందుస్తు చర్యల్లో భాగంగా విమ్స్ ఆస్పత్రిలో 20 పడకలతో ప్రత్యేక వార్డును అవసరమైన మందులతో ఏర్పాటు చేశాం.-
డాక్టర్ కె..రాంబాబు, విమ్స్ డైరెక్టర్
విమ్స్ లో ఏర్పాటు చేసిన హెచ్ ఎమ్ పి వి వార్డ్ ను పరిశీలిస్తున్న డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు