ప్రజాశక్తి-పంగులూరు: కేరళ వరద బాధితుల సహాయార్థం మంగళవారం సాయంత్రం పంగులూరు గ్రామంలోని ప్రధాన వీధుల్లో సిపిఎం ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు. మొత్తం రూ.6 వేలు వచ్చాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు తలపనేని రామారావు, మండలం నాయకులు గుడిపాటి మల్లారెడ్డి మాట్లాడుతూ, కేరళలో కొండ చరియలు విరగటం, విపరీతమైన వరద రావడం వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు, వేలాదిమంది గల్లంతయ్యారని, అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యారని అన్నారు. ఈ విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నం చేస్తుందని, అందులో ప్రజల నుంచి కూడా సహకారం అందాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం విరాళాలు సేకరిస్తుందని తెలిపారు. ప్రజలు ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు తలపనేని రామారావు, మండల నాయకులు గుడిపాటి మల్లారెడ్డి, పూసపాటి సుబ్బరాజు, పాలపర్తి ప్రేమకుమార్, వేమూరి సునందబాబు, పాణికొండ సుధాకర్‌రావు, సరికొండ కృష్ణంరాజు, పాలపర్తి ఏలియా తదితరులు పాల్గొన్నారు.
