ప్రజాశక్తి-పుల్లలచెరువు : వెలుగొండ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి, వెంటనే పూర్తి చేసి, తీగలేరు కాలువను పుల్లల చెరువు చిన్న కండ్లేరు రిజర్వాయర్ వరకు పొడిగించాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన పుల్లలచెరువు బస్టాండ్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అత్యంత వెనుక బడిన ప్రాంతం పుల్లలచెరువుకు, పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో గల తీగలేరు కాలవను పుల్లలచెరువులో ఉన్న చిన్న కండ్లేరు చెరువు వరకు విస్తరించి, నిధులు విడుదల చేసి పనులు చేపట్టాలని కోరారు. రైతులంతా కలిసి ప్రభుత్వానికి పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా, సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్ర మంలో నాయకులు జి గురునాధం, టీసిహెచ్ చెన్నయ్య, బాణాల రామయ్య, టిడిపి మండల కన్వీనర్ పయ్యావుల ప్రసాద్, సర్పంచ్ బడిపాటి ఓబులేసు, ఎంపీటీసీ రాధాకష్ణ, వైస్ ఎంపిపి లింగంగుంట్ల రాములు, కొర్లకుంట జానకీరఘు, పసుపులేటి వెంకటేశ్వర్లు, గుంటూరు శ్రీనివాసచారి, పారా వెంకట నారాయణ, మేడికొండ బసవయ్య, పీన్నేబోయిన వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
