ఆటలు ఓటమిని, కష్టాన్ని భరించే శక్తినిస్తాయి

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ ఆటలు ఓటమిని, కష్టాన్ని భరించే శక్తిని ఇస్తాయని ఎస్‌పి వి.విద్యాసాగర్‌ నాయుడు అన్నారు. బుధవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యా లయంలో జిల్లా వార్షిక పోలీస్‌ స్పోర్ట్స్‌, ఆటల పోటీలు-2024ను ప్రారం భించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పోలీస్‌ సిబ్బందిలో క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ‘పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌’ ఎంతో దోహదపడు తుందన్నారు. ఆటలు ఓటమిని, కష్టాన్ని భరించే శక్తిని ఇస్తాయని. 24 గంటలు విధి నిర్వహణలో ఉండే పోలీస్‌ సిబ్బందికి ఈ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు వారిలో ఉన్న క్రీడాప్రతిభకు గుర్తింపు వస్తుందన్నారు. జిల్లా స్థాయి స్పోర్ట్స్‌ మీట్‌లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర పోలీస్‌ మీట్‌కు పంపిస్తామన్నారు. పిల్లల్ని కూడా ఆటలు ఎక్కువగా ఆడించాలని దాని ద్వారా వారు మానసికంగా, శారీర కంగా దఢంగా అవుతారని అన్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత మొట్ట మొదటి సారిగా జిల్లాలో పోలీసు స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభించడం జరిగిందన్నారు. 27, 28, 29వ తేదీలలో వరుసగా మూడు రోజులు పాటు జరిగే ఈ స్పోర్ట్స్‌ మీట్‌లో 4 జోన్లకు సంబంధించిన 4 టీమ్‌లు (రాయచోటి, మదనపల్లి, రాజం పేట, ఎఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌) కబడ్డీ, వాలీబాల్‌, పుట్‌ బాల్‌, అథ్లెటిక్‌, 100 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్ల పరుగుపందెం, హైజంప్‌, లాంగ్‌ జంప్‌, క్రికెట్‌, టెన్నీస్‌, షటిల్‌ మొదలగు క్రీడలలో పాల్గొంటారన్నారు. స్పోర్ట్స్‌ మరియూ ఆటలు జరుపుకోవడానికి అవకాశం కల్పించిన డిజిపి ద్వారకా తిరుమలరావు, కర్నూలు రేంజ్‌ డిఐజి కోయ ప్రవీణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్‌) ఎం.వెంకటాద్రి, రాయచోటి డిఎస్‌పి ఎంఆర్‌.కృష్ణమోహన్‌, మదనపల్లి, రాజంపేట డిఎస్‌పిలు డి.కొండయ్య నాయుడు, ఎన్‌.సుధాకర్‌, ఎఆర్‌ డిఎస్‌పి బి.చిన్నికృష్ణ, జిల్లాలోని సిఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర అధికారులు, పోలీసు సిబ్బంది, పిఇటి మాస్టర్లు పాల్గొన్నారు.

➡️