అప్పన్న దర్శనానికి గణబాబు పాదయాత్ర

Ganababu sml ap[anna

 ప్రజాశక్తి -గోపాలపట్నం :విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పెతకంశెట్టి గణబాబు హ్యాట్రిక్‌ విజయం సాధించిన సందర్భంగా గోపాలపట్నంలోని ఆయన స్వగృహం నుంచి శనివారం ఉదయం సింహాచలం వరకు పాదయాత్రగా వెళ్లారు. కార్యకర్తలు, నాయకులతో కలిసి వెళ్లిన ఆయన శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో విజయం సాధిస్తే పాదయాత్ర ద్వారా స్వామి దగ్గరకు వస్తానని మొక్కుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి యువనేత మౌర్యసింహ, కార్పొరేటర్లు దాడి వెంకటరమణ, బొమ్మిడి రమణ, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️