గాంధీనగరం సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : మండలంలోని చెముడులంక శివారు గాంధీనగరంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు శనివారం ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డు నిర్మాణం జరగాల్సి ఉండగా తాత్సారం చేశారు. దీంతో సుమారు ఆ వీధి వాసులు ఏడాది పాటు నాన్న అవస్థలు పడ్డారు. ఈ సమస్యను ఎన్నికల నేపథ్యంలో కొత్తపేట కూటమి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దఅష్టికి స్థానికులు తీసుకుని వెళ్లగా రోడ్డు నిర్మాణానికి ఆయన హామీ ఇచ్చారు. గెలుపు అనంతరం స్పందించిన ఆయన ఇచ్చిన హామీ మేరకు గత అక్టోబర్‌ 17న ఉపాధి నిధులు రూ. 20 లక్షలు మంజూరు చేసి 350 మీటర్ల పొడవుతో సిసి రోడ్డుకు శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీంతో రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు సిసి రోడ్డు పనులను స్థానిక మాజీ ఎంపీటీసీ నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్‌ నాగిరెడ్డి వెంకటరత్నం, మాజీ సొసైటీ డైరెక్టర్‌ అడబాల వీర్రాజు, కూటమి నేతలు కె.రామకృష్ణ, శిరంగుల సతీష్‌, గుండుమల్ల రామారావు, లంకలపల్లి ఆంజనేయులు, తదితరులు పరిశీలించి, నాణ్యతా ప్రామాణాలతో రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు.

➡️