గంగమ్మ గుడి హుండీ చోరీ

May 27,2024 10:37 #chori, #Gangamma Temple

తిరుపతి సిటీ : తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలోని బజారు వీధి పిడికిలి గంగమ్మ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయం తాళాలు పగలగొట్టి హుండీ ఎత్తుకెళ్లారు. నిత్యం బజారువీధిలో రద్దీగా ఉన్న ప్రాంతంలో ఆలయ హుండీ ఎత్తుకెళ్లడం స్థానికులను కలవరపెడుతోంది. రాత్రి సమయంలో పోలీసులు గస్తీ తిరుగుతున్నా చోరీ జరగడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. హుండీ చోరీ చేసి ఎత్తుకెళ్లినవారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

➡️