గంగనపల్లి వెంకటరమణకు ఘన సత్కారం

ప్రజాశక్తి – నందలూరు (అన్నమయ్య) : మండలంలోని నాగిరెడ్డిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన తెలుగు పండితులు, కవి గంగనపల్లి వెంకటరమణ ఆదివారం కడపలో ఘన సన్మానం అందుకున్నారు. వెయ్యేళ్ల తెలుగు సాహిత్యం – రాయలసీమ భాగస్వామ్యం” అనే పేరుతో వైయస్సార్‌ జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రెండవ సాహిత్య సాంస్కఅతిక మహాసభలలో గంగనపల్లి వెంకటరమణ పాల్గొని కవితా గానం చేశారు. మన రాయలసీమ చరిత” అనే శీర్షికతో ఆయన రచించిన పద్య కవితలను సభాముఖంగా వినిపించారు. కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్‌ మూల మల్లికార్జున రెడ్డి, ప్రధాన కార్యదర్శి జింకా సుబ్రహ్మణ్యం, ప్రముఖ అవధాని ఆముదాల మురళి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వెల్దండ నిత్యానందరావు, కవితా విద్యా సాంస్కఅతిక సంస్థ వ్యవస్థాపకులు అలపర్తి పిచ్చయ్య చౌదరి, డాక్టర్‌ చింతకుంట శివారెడ్డి, భూతపురి గోపాలకఅష్ణ శాస్త్రి, అధికార భాషా సంఘం పూర్వ సభ్యులు డాక్టర్‌ తవ్వా వెంకటయ్య, డాక్టర్‌ జి. వి. సాయిప్రసాద్‌, డాక్టర్‌ భూమిరెడ్డి స్వరూప రాణి, డాక్టర్‌ వెల్లాల వెంకటేశ్వర చారి తదితరుల చేతుల మీదుగా ఆయన శాలువా, జ్ఞాపిక, ప్రశంశాపత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయలలిత కుమారి, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ఆయనను అభినందించారు.

➡️