హెచ్ఎస్ఎల్ నూతన డైరెక్టర్ (షిప్ బిల్డింగ్) గా బాధ్యతలు స్వీకరించిన గంటి వెంకటేశ్వర్లు

Nov 29,2024 16:40 #vizag

ప్రజాశక్తి – ఎంవిపి కాలనీ : హిందూస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ డైరెక్టర్ షిప్ బిల్డింగ్ డైరెక్టర్ గా గంటి వెంకటేశ్వర్లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గంటి వెంకటేశ్వర్లు 2018 మేలో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో అదనపు జనరల్ మేనేజర్ గా చేరారు అప్పటి నుండి హెచ్ఎస్ఎల్ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. షిప్ బిల్డింగ్, సబ్ మెరైన్ రెట్రోఫిట్ మెంట్, షిప్ రిపేర్స్ అనే మూడు బిజినెస్ యూనిట్లలో పనిచేశారు. బిజినెస్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ హెడ్ గా, 05 ఫ్లీట్ సపోర్ట్ షిప్ ల నిర్మాణం కొరకు హెచ్ఎస్ఎల్ అతిపెద్ద ఆర్డర్ పై సంతకం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఐఎన్ఎస్ సింధువీర్, ఆస్ట్రధర్ని, సుజాత, సట్లెజ్ ఇతర షిప్ రిపేర్ ప్రాజెక్టులకు నార్మల్ రీఫిట్స్ సకాలంలో పూర్తి చేయడం ఆయన ముఖ్య పాత్ర పోషించారు. లోనావ్లాలోని ప్రతిష్ఠాత్మక నేవల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ పూర్వ విద్యార్థి అయిన ఆయన పదవీకాలం లో నేవీ డాక్క్ యార్డ్ ల తో పాటు నేవీకి చెందిన ఫ్రంట్ లైన్ యుద్ధనౌకల్లో పనిచేశారు. హెచ్ఎస్ఎల్లో చేరడానికి ముందు, అతను భారత నావికాదళంలో 25 సంవత్సరాలకు పైగా తన కెరీర్లో దేశవిదేశాలలో వివిధ ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు.

➡️