ప్రజాశక్తి – ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్) పెంచిన వం ట గ్యాస్ ధరలు తగ్గిం చాలని ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్ బేగం తెలిపారు. గురువారం కడప జిల్లా ప్రొద్దుటూరులో అమతనగర్ కాలనీలో మహిళలతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ గ్యాస్ ధరలు పెంచి ప్రజల తలమీద బండరాయి వేసినట్లు అయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద మండి పడుతున్నా, ప్రజల నిరసన చేస్తున్నా పట్టించుకోకసోవడం దారుణమన్నారు. ఒకేసారి రూ.50 పెంచితే పేద ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో విజయ, సల్మా, రెస్మా, జయమ్మ, కొండమ్మ, శ్యామల, ఇమంబీ, మాబుచన్ పాల్గొన్నారు. ప్రొద్దుటూరు: గ్యాస్ ధరలు తగ్గిం చాలని కోరుతూ స్థానిక రాజీవ్ సర్కిల్లో గురువారం గ్యాస్ సిలిండర్లతో ఆందో ళన కార్యక్రమం నిర్వహించారు. గ్యాస్ ధరలను తగ్గించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని నాయకులు హెచ్చరించారు. కార్య క్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి సత్యనారాయణ, పట్టణ కమిటీ సభ్యులు బాబు పకీరయ్య శేఖర్, చెన్నారెడ్డి మురళి శారద శీను పాల్గొన్నారు. జమ్మలమడుగు రూరల్ : వాయుబండ కాదు సామాన్యుని నెత్తిపై గుది బండ అని వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించు కోవా లని సిపిఎం నాయకులు జి.ఏసుదాసు డిమాండ్ చేశారు. కేంద్రం తక్షణమే గ్యాస్ పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలి అని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు ఉపాధ్యక్షులు వినరు కుమార్, మధు పాల్గొన్నారు
